తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి గళమెత్తిన నటి మాధవీ లత.. ఈరోజు తన ఫేస్‌బుక్ ఫాలోవర్లపై లైవ్లో మండిపడింది. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనకు ఎందుకు మద్దతు ఇవ్వడంలేదనే ప్రశ్నలకు గట్టిగానే బదులిచ్చింది. ముఖ్యంగా తనపై వ్యతిరేకంగా, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తు్న్న ఫాలోవర్లపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా పలువురు చేసిన కామెంట్స్‌కు ఆమె సమాధానం చెబుతూ.. ‘‘ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలంటే భయమేస్తోంది. అంతా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు’’ అంటూ భావోద్వేగానికి గురైంది. ‘‘నాకు ఫ్యామిలీ ఉంది. ఆమెలా నేను చేయలేను’’ అని చెబితే.. ‘‘ఆ అమ్మాయికి ఫ్యామిలీ లేదా? ఆమె పోరాడటం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను కూడా ఆమెలా బట్టలు విప్పాలని అనుకుంటున్నారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నేను కూడా ఆమెలాగే బట్టలు విప్పుతానని ఆశిస్తున్నారేమో. కొన్ని కోట్లు ఇచ్చినా.. అది జరగదు’’ అని తెలిపింది. అంతేకాదు శ్రీరెడ్డి పేర్లు బయటపెట్టింది. వాళ్లను పోలీసులు అరెస్టు చేశారా? ప్రజలు వారిని చితకొట్టారా? వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏదీ జరగదు. అధికారంలో ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరు. అదే నా చేతిలో అధికారం ఉంటే తాట తీస్తా. మీ ఆఫీసులో సమస్య ఉంటే.. బయటకు వెళ్లి రాద్దాంతం చేస్తే పరిష్కారం లభిస్తుందా అని తెలిపింది.
Posted by Actress Maadhavi on Thursday, 12 April 2018