ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. బీజేపీ, వైసీపీపై ఎమ్మెల్యే చింతమనేని విమర్శలు సంధించారు. ఇంటింటికీ టీడీపీ తరహాలో.. ఇంటింటికీ తిరిగి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ బీజేపీ అవలంభిస్తున్న ద్వంద వైఖరిని ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ సారి వైసీపీ అధికారంలోకి రావాలి.. ఆ తరువాత కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలపాలి అన్న రహస్య ఒప్పందాన్ని వైఎస్ జగన్ ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. వైసీపీ, బీజేపీలకు దమ్ముంటే త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే చింతమనేని.
