తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 29న నిర్వహించాల్సిన యాదవ ,కురుమ శంఖారావం సభ వాయిదా వేస్తునట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఎండల తీవ్రతతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో సభకు రక్షణ శాఖ అనుమతిలో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్పారు. శంఖారావం సభ కోసం జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.అయితే అతి త్వరలోనే సభ నిర్వహణ తేదీ ని ప్రకటిస్తామని మీడియాతో అన్నారు. కాగా ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
