Home / POLITICS / టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు

టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు పార్కింగ్, నగర అలంకరణ, వాలంటరీస్, భోజన కమిటీ, మీడియా కోఆర్డినేటర్స్, సాంస్కృతిక కమిటీలకు బాధ్యులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆరుగురితో తీర్మాణాల కమిటీని ఏర్పాటు చేశారు.

పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన ఈనెల 27న హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్లో ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత సీఎం కే చంద్రశేఖర్ రావు ఇప్పటికే నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరుగుతున్న ఐదో ప్లీనరీ. ఈ ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులు 12 నుంచి 15వేల మంది హజరుకానున్నారు. ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం వంద మంది వరకు ఆహానిస్తున్నారు. ఈ ప్లీనరీకి మండల, మున్సిపల్ పై స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రతినిధులుగా ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానితుల జాబితాను ఖరారు చేశారు. పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి పార్కింగ్, ప్రతినిధుల నమోదు, భోజనాలను పకడ్బందిగా చేయనున్నారు.

తెలంగాణ వంటకాలతో నోరూరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. ప్లీనరీ సందర్భంగా నగరంలో అనుమతించిన ప్రాంతాల్లో హోర్డింగ్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ముఖ ద్వారాల్లోనే స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. వాలంటరీస్ ద్వారా పార్టీ ప్రతినిధులకు సాయమందించనున్నారు. వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ, చల్లటి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీకి ఆహ్వానితులైన ప్రతినిధులు ఈనెల 27న శుక్రవారం ఉదయం 10 గంటకల్లా ప్రాంగణానానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరు ఈ ప్లీనరీకి హజరై విజయవంతానికి సహాకరించాలని సుభాష్ రెడ్డి కోరారు.

ప్లీనరీ నిర్వహణ కమిటీలు
ఆహ్వాన కమిటీ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి.
సభా ప్రాంగణం, వేదిక : టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.
ప్రతినిధుల నమోదు, పార్కింగ్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ గౌడ్, మేడ్చల్ ఎమ్మెల్యే ఎం సుధీర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే సీహెచ్ కనకారెడ్డి.
నగర అలంకర : జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్.
వలంటీర్ల కమిటీ : ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్.
భోజన కమిటీ : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
మీడియా కో-ఆర్డినేటర్స్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి.
సాంస్కృతిక కమిటీ : రాష్ట్ర సాంస్కృతిక వారథి చైర్మన్ రసమయి బాలకిషన్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat