పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్ లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రైతుల ఆందోళనకు మీ మద్దతు ఇలానే కొనసాగించాలని రాందేవ్ బాబా ను ఎంపీ కవిత కోరారు.పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి గత ౩౦ ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని..పసుపు బోర్డ్ ను ఏర్పాటు చేసే విధంగా ప్రధాని మోదీ తో మాట్లాడాలని రాం దేవ్ బాబాకు ఎంపీ కవిత ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.