పసుపు బోర్డ్ కోసం రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోని గిరి రాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీష్ రావు,ఎంపీ కవిత తో కలిసి యోగ శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డ్ కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత తీవ్రంగా కృషి చేస్తున్నారని… దేశంలో పతంజలిదే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు. దేశంలో 15 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ పతంజలి గ్రూప్ ద్వారా జరుగుతుందన్నారు. పతంజలి సంస్థలో లక్ష మంది పనిచేస్తున్నారని చెప్పారు..