వైఎస్ జగన్. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడమేంటి..? మాకేదో మేలు చేస్తాడులే అని భావించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజలందరికీ తెలిసేలా అధికార పార్టీని ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చే అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుకాకపోవడటమేంటి..? వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను గాలి తిరిగుళ్లు తిరగమని.. రోడ్డున వదిలేశారా..? లేక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే.. చంద్రబాబు పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరిపోతారన్న భయం వైఎస్ జగన్కు పట్టుకుందా..? అసెంబ్లీకి హాజరుకాలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడా..?? అంటూ ఇటీవల కాలంలో అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు నుంచి సీఎం చంద్రబాబు వరకు మీడియా ముందు విమర్శించిన విషయం తెలిసిందే.
అలా వైఎస్ జగన్ను నిత్యం విమర్శించే పచ్చమీడియాకు దిమ్మతిరిగేలా వైసీపీ శ్రేణులు సమాధానం చెప్పే కథనం ఇది..!!
2014 ఎన్నికల్లో ఇటు ఏపీలో జనసేనతోను, అటు కేంద్రంలో బీజేపీతోను జతకట్టి అమలు కాని హామీలతో, మోసపూరిత మాటలతో, అడ్డదారిలో టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రత్యేక హోదా సాధిస్తానని చంద్రబాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టిన విషయం విధితమే. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని తెలిసినా.. తమ పార్టీ నేతలకు కేంద్ర మంత్రులు కట్టబెట్టేందుకు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుది. అయితే, ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం ఉద్యమం చేస్తున్న వైఎస్ జగన్.. ఉద్యమంలో భాగంగా వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న టీడీపీ నేతలు కూడా రాజీనామా చేసేలా తన ఉద్యమాన్ని నడిపారు వైఎస్ జగన్.ఔ
ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? కోడలు మగ బిడ్డను కంటానంటే.. అత్త వద్దంటాదా..? అన్న సీఎం చంద్రబాబుచేత.. మళ్లీ ప్రత్యేక హోదానే కావాలనిపించి, 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి 41వ రుచి చూపించిన రాజకీయ వేత్తగా వైఎస్ జగన్ నిలిచారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది, తొందరపడితే వచ్చే ప్యాకేజీ కూడా పోతుందంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించిన చంద్రబాబుచేత కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేలా చేశాడు వైఎస్ జగన్. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో టీడీపీ వేరేగా అవిశ్వాస తీర్మానం పెట్టిందనుకోండి.. అది వేరే విషయం..!
అయితే, ఇటీవల కాలంలో బీజేపీ, టీడీపీ నేతలే వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రను గురించి మాట్లాడుతూ.. జగన్ దమ్మున్న మగాడు అంటూ మీడియా సాక్షిగా చెప్పారు కూడాను. నాడు ఓదార్పు యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించి.. నేడు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు నిత్యం కృషి చేస్తున్నారు వైఎస్ జగన్. జగన్ను చూస్తుంటే.. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ గుర్తుకు వస్తున్నారంటూ మరికొందరు సీనియర్ నాయకులు పలు ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం విధితమే. పై అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటే.. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు..! ప్రజా నాయకుడు..!! అన్న మాటను ఒప్పుకోక తప్పదు మరీ.
Note: బోనులో ఉన్నా…అడవిలో ఉన్నా సింహం.. సింహమే.. అన్న చందాన వైఎస్ జగన్ అసెంబ్లీలో ఉన్నా.. లేకున్నా 40 ఏళ్ల రాజకీయ చాణుక్యత కలిగిన చంద్రబాబును సైతం ముప్పుతిప్పలు పెట్టేలా ప్రణాళికలు రచించాడంటే గ్రేటే మరీ..!