తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఖమ్మం విప్లవాల ఖిల్లా అని అన్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం అబ్బురపడేలా తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుందని..దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.పేదవాడి కష్టం, కన్నీళ్ల నుంచి ఉద్భవించిన రాష్ట్రం తెలంగాణ అని.. సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని చెప్పారు. ప్రతి నిరుపేద ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఉద్ఘాటించారు.రేషన్ బియ్యం పై సీలింగ్ ఎత్తివేశామని..పెన్షన్ల కోసం రూ.4000 కోట్లు పైగా కేటాయిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,ఇంద్రకరణ్ రెడ్డి ,ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పార్టీ నాయకులూ,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.