ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ లో సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ఏర్పాట్ల పై కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ బస్తీ దవాఖానా లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని వివరించారు. ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఈ బస్తీ దవాఖానా లు ఉపయోగపడతాయి అన్నారు. అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని మోండా మార్కెట్ డివిజన్లో ని సాంబమూర్తి నగర్, టకారా బస్తీ , రాంగోపాల్ పేట డివిజన్ లోని హైదర్ బస్తీ, వెంగళ్ రావు నగర్, దుర్గా టెంపుల్, బేగంపేట డివిజన్ లోని పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్ బస్తీ, బన్సీలాల్ పేట డివిజన్ లో ఉప్పలమ్మ టెంపుల్, IDH కాలనీ, అమీర్ పేట డివిజన్ లో కుమ్మరిబస్తీ, BJR నగర్, సనత్ నగర్ డివిజన్ లో అల్లా ఉద్దీన్ కోటి, ఉదయ భారతి నగర్ లలో బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు బస్తీ దవాఖానా సేవలను వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.