జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో సినిమా తక్కువ… ఇంటర్వల్ ఎక్కువ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఇదే పవన్ కల్యాణ్ బీజేపీకి,టీడీపీకి ఓటేయమని చెప్పి రాష్ట్రాన్ని ముంచాడా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే పవన్ కల్యాణ్ ఇప్పుడు బాబు, బీజేపీ ముంచారని ఇప్పుడు చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ముంచడంలో పవన్ పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు బావి చూసుకుని దూకితే మంచిదని..ఏపీకి చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు. ఎంపీ హేమమాలిని కలవడానికే బాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలిపారు.