ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనేత ,ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు శుక్రవారం ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.అయితే గత పన్నెండు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమల్లో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూనే
ఉంది.అయితే లోక్ సభ స్పీకర్ సభ ఆర్డర్ లో లేదని సభను వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ఈ రోజుతో ముగియనుండటంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.అనుకున్నట్లే అందరు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలను సిద్ధం చేశారు .ఇక్కడే యువ ఎంపీ మిథున్ రెడ్డి సభ ప్రారంభం కాకముందే స్వయంగా వెళ్లి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు లేఖ ఇచ్చారు.
ఆ తర్వాత సభ నిరవదికంగా వాయిదా పడటంతో మిగిలిన వైసీపీ ఎంపీలు తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించారు.అయితే యువ ఎంపీ మిథున్ రెడ్డి ముందుగా రాజీనామా చేసి తమ పార్టీ ఏపీ ప్రజల సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందో మరోసారి నిరూపించారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..