క్రికెట్ మ్యాచ్ లకు సిద్ధిపేట స్టేడియం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్రామీణ స్థాయి నుండి వివిధ క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యాలను అందిపుచ్చుకున్న ప్రాంతం సిద్దిపేట.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్న.. క్రిడా అభిమానుల స్పూర్తి ,యువతలో ఉన్న క్రిడా మక్కువను గ్రహించి సిద్దిపేట మినిస్టేడియ గా ఉన్న మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ ,జాతీయ స్థాయి గుర్తింపు సాధించి పెట్టారు.
ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అస్సోసియేషన్ వారి ఆద్వర్యంలో 3రోజుల పాటు జాతీయ స్థాయి ఆమోద మ్యాచ్ లకు వేదిక అయింది.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం తరవాత రాష్ట్రంలో సిద్దిపేట స్టేడియం అంతర్జాతీయ ,జాతీయ మ్యాచ్ లకు రెండవ వేదిక గా గుర్తింపు సాదించింది.అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ లు శ్రీలంక మరియు క్యాట్ (క్రికెట్ అస్సోసియేషన్ ఆఫ్ తెలంగాణ ) మధ్య జరుగుతున్నాయి.
ఈ క్రమంలో రేపు తెలంగాణ రాష్ట్రం మరియు శ్రీలంక జట్టు మధ్య ఉదయం 10:30ని..లకు సిద్దిపేట స్టేడియం లో 40ఓవర్ల లీగ్ మ్యాచ్ జరగనుంది.ఈ విషయాన్నిసిద్దిపేట క్రికెట్ అస్సోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లిఖార్జున్ తెలిపారు.. రాష్ట్రంలో సిద్దిపేట రెండవ స్టేడియంగా ఎంపిక కావడం మంత్రి హరీష్ రావు గారి అభివృద్ధి చేసిందానికి నిదర్శనం అని అయన అన్నారు..రేపు క్రికెట్ అస్సోసియేషన్ ఆఫ్ తెలంగాణ అద్వర్యం లో ఈ మ్యాచ్ లు జరుగుతున్నాయి అని…ఈ మ్యాచ్ ని తిలకించడానికి సిద్దిపేట ప్రాంత క్రిడా కారులు , క్రిడా అభిమానులు ,యువత పెద్ద ఎత్తున రావాలని మన సిద్దిపేట క్రిడా చైతన్యన్నాన్ని దేశ స్థాయిలో చాటి చెప్పాలని ఈ సందర్భంగా అయన కోరారు….