నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు తెగ పోరాటం చేస్తూ ఐదున్నరకోట్ల తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విజయవంతమైంది.ఇందులో భాగంగా ఎక్కడ పేరు వైసీపీ పార్టీకి దక్కుతుందో అని తెగ భయపడిన టీడీపీ నేతలు వైసీపీ నేతలపై విరుచుకుపడటం మొదలెట్టారు.
ఇది చదవండి:వైసీపీలోకి 4గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..
అందులో భాగంగా టీడీపీ నేతలు సినీమావాళ్ళను కూడా వదిలిపెట్టకుండా విమర్శలు కురిపించారు.టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినీమావాళ్ళు ఏసీ రూమ్స్ ల్లో కూర్చోని ఎంజాయ్ చేస్తూ ప్రజల సమస్యను గాలికి వదిలేశారు అంటూ విరుచుకుపడ్డారు .టీడీపీ నేతలు తమపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు .ఈ నేపథ్యంలో నిప్పుకు గాలి తోడైనట్లు టీడీపీ నేతలకు మద్ధతుగా ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కి చెందిన ఒక ప్రముఖ యాంకర్ కూడా వీళ్ళపై విరుచుకు పడ్డారు .ఈ వ్యాఖ్యలపై సినీమా ఇండ్రస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలు ,సీనియర్ హీరోలు తమ కుటుంబ సభ్యుల దగ్గర గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారు ఎవరూ కూడా తమను నిందించలేదు.
ఇది చదవండి:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ షాక్-బీజేపీలోకి ఎంపీ .!
ఆట్లాంటి మమ్మలని ఇలా అనడం భావ్యం కాదు.తమ రాజకీయ లబ్ధి కోసం ఇలా ఆరిపోసుకోవడం చాలా బాధగా ఉంది..ఇప్పటికే టీడీపీకి అండగా ఉంటూ వచ్చిన నందమూరి కుటుంబ సభ్యులు అయిన హరికృష్ణ లాంటివారు ఆ పార్టీకి దూరం కాగా .మంచు కుటుంబం వైసీపీ కి మద్ధతుగా మాట్లాడుతున్నరు. మరోవైపు ప్రముఖ దర్శక నిర్మాత అయిన పోసాని కృష్ణమురళి టీడీపీపై విరుచుకుపడుతున్నారు .
ఇది చదవండి:ఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి కళ్లలో ఆనందం..మీకు తెలుసా..
ఆయనే స్యయంగా వైసీపీకి సపోర్టు చేస్తా అని మీడియా సాక్షిగా తేల్చి చెప్పారు. ఇక అక్కినేని కుటుంబం ఎప్పటి నుండో వైఎస్సార్ కుటుంబంతో సత్సంబంధాలను కోనసాగిస్తూ వస్తుంది.దగ్గుబాటి వారసులు అయిన విక్టరీ వెంకటేష్,ప్రముఖ నిర్మాత సురేష్ బాబు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు . టీడీపీకి సపోర్టు చేసేవాళ్ళు మినహా మిగతావారు బాబుకు దూరమైనట్లు సినీ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నారు.వైసీపీ పార్టీకి వీళ్ళంతా మద్ధతుగా నిలుస్తారని . అవసరమైతే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గోనే అవకాశాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు ..