శ్రీరెడ్డి, సినీ ఇండస్ర్టీపై తాజాగా యుద్ధం ప్రకటించిన తెలుగు నటి. తమిళ సినీ ఇండస్ర్టీలానే, టాలీవుడ్‌లోనూ తెలుగు నటీ నటులకు అవకాశాలు ఇవ్వాలని పోరాడుతున్న నటుల్లో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవకాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.
అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్ తెలుగు సినీ ఇండస్ర్టీ నటులు శ్రీరెడ్డితోపాటు జ్యోతిని కూడా ఇంటర్వ్యూ చేయగా.. జ్యోతి మాట్లాడుతూ.. వాడొచ్చాడు, తలుపు కొట్టాడు, నేను తలుపు తీశాను, అప్పుడే నాకు అర్థమై పోయింది, ఇటువంటి మాటలెందుకు.. ఆ వచ్చిన వాడెవడో పేరు చెప్పేయొచ్చుకదా….? అంటూ అడగడంతో వెంటనే స్పందించిన శ్రీరెడ్డి వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీకి సంబంధించిన నేను నాన్న అబద్ధం చిత్రం డైరెక్టర్ గోవింద వర్మ అంటూ పేరు చెప్పేసింది. ఇలా శ్రీరెడ్డి ఒక్కొక్కరి పేరు బయటపెడుతుండటంతో టాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్నారు సినీ జనాలు.