Home / ANDHRAPRADESH / ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముడుపులు అందాయి..! నేనే సాక్ష్యం..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముడుపులు అందాయి..! నేనే సాక్ష్యం..!!

అవును, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముడుపులు అందాయి. అందుకు నేనే సాక్ష్యం, కావాలంటే మోడీ, చంద్ర‌బాబుల నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ముడుపులు తీసుకున్న స్థ‌లంతోపాటు, స‌మ‌యం కూడా చెబుతాను. స్థ‌లం చిత్తూరు, స‌మ‌యం అర్థ‌రాత్రి. తిరుమ‌ల తిరుప‌తి కొండ‌పై వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ముడుపులు తీసుకుని టీడీపీ, బీజేపీ పార్టీల త‌రుపున ప్ర‌చారం చేశారు. వారు ఆ రోజున ఇచ్చిన డ‌బ్బులు అయిపోవ‌డంతో మ‌ళ్లీ టీడీపీ, బీజేపీల‌తో బేరం కుదుర్చుకోవ‌డానికి య‌త్నించాడు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ అడిగిన మొత్తం ఇవ్వ‌క‌పోవ‌డంతోనే మ‌ళ్లీ ఆ పార్టీల‌కే అడ్డం తిరిగాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌.

see also :

క‌ళ్లు బ‌య‌ర్లుక‌మ్మే వాస్త‌వ క‌థ‌నం మీ కోసం..!!

అయితే, 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ నుంచి ప‌వ‌న్ క‌ల్యాన్ ముడుపులు తీసుకుని ప్ర‌చారం చేశారంటూ ప‌లు ప‌త్రిక‌ల‌తోపాటు రాజ‌కీయ విశ్లేష‌కులు మీడియా ముఖంగా చెప్పిన విష‌యం తెలిసిందే. ఇంకాస్త విశ్లేష‌ణాత్మ‌కంగా చెప్పుకోవాలంటే.. 2014లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా అధికారం చేప‌ట్టిన త‌రువాత సాధార‌ణ వ్య‌క్తి నుంచి ప్ర‌భుత్వాధికారి వ‌ర‌కు ఏ ఒక్క‌రిని వ‌ద‌ల‌కుండా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, నేత‌లు చేయి చేసుకున్న విష‌యం తెలిసిందే. అటువంటి సంద‌ర్భంలోనూ ప్ర‌శ్నించ‌డానికంటూ పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించ‌లేదు. అదే సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాన్ టీడీపీకి తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. మ‌హిళ‌ల‌ను సైతం వ‌ద‌ల‌కుండా టీడీపీ నేత‌లు అరాచ‌కాలకు పాల్ప‌డుతుంటే.. ఏపీకి, త‌న‌కు సంబంధం లేద‌నే విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రికీ తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat