నాడు గోదావరి పుష్కరాల్లో 35 మంది మృతి, నేడు ఒంటిమిట్టలో అట్టహాసంగా జరగాల్సిన రాములోరి కల్యాణంలో నలుగురు మృతి, దేనికి సంకేతం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఎంతో ఆర్భాటంతో, అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కార్ తీరా 35 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు అదే సీన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోనూ చోటు చేసుకుంది. అయితే, నిన్న ఒంటిమిట్టలో ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా గాలివాన రావడంతో రాములోరి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసింద.
చంద్రబాబు వచ్చిన తరువాత.. చంద్రబాబు రాక ముందు..!!
గోదావరి పుష్కరాల్లో అలా..
ఆ రోజు మంగళవారం, తేది Jul – 14 – 2015, వేదపండితులందరూ కలిసి జూలై 14వ తేదీన ఉదయం 6:20 గంటలకు పుష్కరాల ముహూర్తాన్ని నిర్ణయించారు. వేదపండితుల ము హూర్తాన్ని ఖరారు చేయడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించడానికి రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. అంతలోనే మరికాసేపట్లో సీఎం చంద్రబాబు కుటుంబం పుణ్యస్నానం ఆచరించేందుఉ వస్తున్నారంటూ మైక్ అనౌన్స్‌మెంట్. దీంతో గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి వచ్చిన వారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు పోలీసులు.
see also :
టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తను వేటకొడవళ్లతో దారుణ హత్య
సమయం 6:20, గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే సమయం. సీఎం చంద్రబాబు తన కుటుంబ సమేతంగా వచ్చి కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించారు. 7:30 గంటల వరకూ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కోటగుమ్మం ఘాట్‌లోనే స్నానం ఆచరించారు.
సమయం 7:40, సీఎం చంద్రబాబు నాయుడి కుటుంబం గోదావరి పుష్కర స్నానం అయిపోగానే, అప్పటి వరకు నిర్బంధంలో ఉంచిన భక్తులను ఒక్కసారిగా వదిలేశారు పోలీసులు. ఇక అంతే, అప్పటికే పుణ్యస్నానం ఆచరించేందుకు ఎప్పట్నుంచో వేచి ఉన్న భక్తులు ఒక్క ఉదుటున పరుగులు పెట్టారు. భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 35 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఒంటిమిట్ట రాములోరి కల్యాణంలో ఇలా..
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో నిన్న అనుకోని సంఘటన జరిగింది. ఒంటిమిట్టలో ఎంతో అట్టహాసంగా జరగాల్సిన రాములోరి కల్యాణోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఊహించని విధంగా గాలివాన రావడంతో ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం కోసం అలంకరించిన సామాగ్రి, భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన వేదికలు గాలివానకు ఎగిరిపోయాయి. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. 70 మంది భక్తులకు పైగా గాయపడ్డారని సమాచారం. ఏదేమైనా పవిత్రమైన దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగడం రాష్ట్రానికి మంచిది కాదన్నది పురోహితుల మాట.