కొంతమంది యువకులు చేసిన పనికి అమ్మాయిలపై ఎవ్వరైన రేప్ చెయలంటే బయపడే విధంగా నిందితులను అవమానించారు. నడిబజార్లో ఊరేగించకుంటు నలుగురు యువకులను మహిళలు చితక్కొట్టారు. భోపాల్‌లోని. 20 ఏళ్ల యువతికి తను చదువుతున్న కాలేజీలోని సీనియర్లు పరిచయం అయ్యారు. ఇదే అదునుగా భావించిన శైలేంద్ర దంగీ(21) ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువతిని అత్యాచారం చేసేందుకు శైలేంద్ర ప్లాన్ చేసుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం.. శైలేంద్ర యువతిని శనివారం ఓ రెస్టారెంట్ వద్దకు రమ్మని చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇరువురి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడు శైలేంద్ర. ఆ తర్వాత యువతిని తన స్నేహితుడు సోను దంగీ(21) రూమ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే సోను దంగీ, ధీరజ్ రాజ్‌పుత్(26), చిమన్ రాజ్‌పుత్(25) ఆ గదిలో ఉన్నారు.
అమ్మాయిపై శైలేంద్ర, సోను అత్యాచారం చేయగా.. మిగతా ఇద్దరు యువకులు సహకరించారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని యువతిని బెదిరించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆదివారం ఉదయం మహారాణా ప్రతాప్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంట లోపే నిందితులను అరెస్టు చేశారు. అనంతరం నిందితులను బోఫాల్ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు.. నిందితులను చెప్పులతో చితక్కొట్టారు. యువకులు వేధింపులకు గురి చేస్తే మహిళలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే నిందితులను ఊరేగించామని భోపాల్ పోలీసులు తెలిపారు.