ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీ లో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు తమ కెరీర్ కు గుడ్ బై చెప్పి వివాహా జీవితంలో ఉంటున్న సంగతి తెల్సిందే .అయితే ఇలా అందరి విషయంలో జరగక్కపోయిన కానీ ఎక్కువశాతం ఇలాగే ఉంటుంది .
కానీ టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీను తీసుకుంటే పెళ్లి అయిన కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి వారు తమ పెళ్లి తర్వాత కూడా గ్లామర్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతున్న సమంతా పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది .
అయితే ఆమె ఏకంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నది అంట .అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమాతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటోంది ఈ అమ్మడు.అయితే ఈ నెల ఆరో తారీఖున సమంత చైతు వివాహం గోవాలో జరగనున్న సంగతి తెల్సిందే .