వైసీపీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గమైన నరసరావు పేట లో పాదయాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అక్కడ
భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
అయితే ఇక్కడే జగన్ కు వస్తున్నా ప్రజాదరణను చూసి తట్టుకోలేని కోడెల కుటుంబం ఎక్కడ తమకున్న ప్రజాదరణ జగన్ కు వెళ్ళుతుంది అని భయపడి జగన్ కు జెడ్ ప్లస్ భద్రతను తప్పించారు.అక్కడితో ఆగకుండా జగన్ భారీ బహిరంగ సభకు భద్రతగా ఉండాల్సిన పోలీసులను వెనక్కి రమ్మని ఆదేశాలను జారీ చేయించాడు అని కోడెల వారసుడు కోడెల శివరాంపై వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే జనాలు జిల్లా వ్యాప్తంగా జగన్ సభకుతరలివస్తున్న కానీ నరసరావుపేట లో ట్రాపిక్ పోలీసులు కూడా లేకుండా వేరే చోటకి పంపించేశారు స్థానిక ఉన్నతాధికారులు.దీంతో వైసీపీ శ్రేణులు డీఎస్పీ వద్దకు వెళ్లారు .ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వివరించారు.జగన్ కున్న భద్రతను తగ్గించి కుట్రలు చేసి విధ్వంశం సృష్టించి అది జగన్ ఖాతాలో వేసి పాదయాత్రను నిలివేసేలా ప్రణాళికలు ..కుట్రలు చేస్తున్నారు అని వైసీపీ శ్రేణులు వివరించారు.చూడాలి మరి ఎప్పుడు ఏమి జరుగుతుందో ..!