తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలకు ,నేతలకు ,మంత్రులకు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి సంచలనాత్మక సవాలు విసిరారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై ప్రజలతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్న సంగతి విదితమే.పోసాని కృష్ణమురళి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే ..రావాలంటే నాదగ్గర రెండు మార్గాలు ఉన్నాయి.
అవి ఏమిటి అంటే గత అరవై ఏండ్లుగా ప్రజలే ..సామాన్యులే ప్రాణాలు అర్పించారు.పోలీసుల కాల్పుల్లో మరణించారు ..గాయపడ్డారు.అందుకే అసెంబ్లీ లో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో ..మంత్రులందరూ ముఖ్యమంత్రి తో సహా ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రంలో విజయవాడ నగరంలో పొట్టి శ్రీరాములు గారు చేసినట్లు ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం ..ప్రజల తరపున నేను ఒక్కడ్నే వస్తా .
ముప్పై రోజుల పాటు అన్నం కాదు పచ్చి నీళ్ళు త్రాగకుండా దీక్ష చేద్దాం ..అప్పుడే మోదీ స్పెషల్ ప్లైట్ లో వచ్చి మరి ప్రత్యేక హోదా ఇస్తారు.ఒకవేక ఇది సాధ్యం కాదా అయితే రెండో మార్గం ఏమిటంటే ప్రజాసంఘాలు ఉన్నాయి కదా ..అందరూ కల్సి దాదాపు మూడు కోట్ల ప్రజలతో విజయవాడ నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు పాదయాత్రగా పోదాం.అదో ప్రపంచ వింత
అవుతుంది.ఇలా మోదీ దిగొచ్చిన ప్రత్యేక హోదా ఇస్తారు.ఈ రెండు పాటించండి తప్పకుండ ప్రత్యేక హోదా వస్తుందని ఆయన అన్నారు ..