అఖిల్ అవకాశానికి గండి కొట్టిన స్టైలిష్ స్టార్..!! అదేంటి అక్కినేని వారబ్బాయికి, అల్లువారబ్బాయి గండికొట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును, అఖిల్ అవకాశానికి స్టైలిష్ స్టార్ గండికొట్టాడు. అయితే, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో కొరటాల శివ వరుస విజయాలతో దూసుకుపోతు ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాకుండా, కొరటాల శివ తీసింది మూడే సినిమాలు అయినా, ఆ మూడింటిలో రెండు చిత్రాలు తెలుగు సినిమా జాబితాలో టాప్ – 5లో నిలిచాయి. ఈ విజయాలు స్టార్ హీరోలు సైతం కొరటాల శివ వెంటపడేలా చేశాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌బాబుతో కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
see also : చంద్రబాబు..నారా లోకేష్ పై సంచలన వాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి
ఆ విషయం అటుంచితే, ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుడిపై అక్కినేని నాగార్జున కన్నుపడిందట. అయితే, నాగార్జున తన రెండో తనయుడు అఖిల్‌కు సక్సెస్ ఇవ్వాలన్న పడుతునన తాపత్రయం అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని చిత్రసీమ వారు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం. అఖిల్ హీరోగా నటించింది రెండే సినిమాలు అయినప్పటికీ, ఆ రెండు కూడాను బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దీంతో అఖిల్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడట నాగార్జున. అయితే, నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ చిత్రం కోసం ఇప్పటికే కొరటాల శివను లైన్లోపెట్టేశాడని టాలీవుడ్ సమాచారం. దీంతో కొరటాల శివ దర్శకత్వంలోనైనా హిట్ కొట్టాలనుకున్న అఖిల్ ఆశలకు స్టైలిష్ స్టార్ గండికొట్టారంటూ టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
see also :