ఆంద్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మోసపోయిన బాధితులు.. కష్టాలు అనుభవించే బడుగు, బలహీనులు అనేక మంది ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పనులు దొరక్క పొట్టచేత పట్టుకొని జిల్లాలు దాటి వచ్చిన వలస కూలీలను వైఎస్ జగన్ కలుసుకున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ ను వలస కూలీలు కలుసుకున్నారు.
see also..
బాబు & లోకేష్ కు పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ..!
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా పత్తికొండ, అనంతపురం గుత్తి నుంచి మిరపకాయలు పనికి గుంటూరు వలస వచ్చామని కూలీలు తెలిపారు.పనులు దొరకడం లేదు.. బతకలేకపోతున్నాం.. కూలీ కూడా సరిగా వచ్చేట్టు లేదు.. మంచి రోజులు వస్తాయనే గంపెడాశతో బతుకీడుస్తున్నాం’ అని మల్లేష్ అనే వ్యక్తి అన్నాడు. యాదమ్మ, ఈశ్వరి, ప్రభావతి… ఇలా దాదాపు 15 మంది కూలీలు పొలాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా పిల్లలను చదివించలేకపోతున్నాం.. చూడయ్యా మట్టి పనికి పంపుతున్నామని కన్నీటితో మహిళలు తెలిపారు. ఇంకా కరువు డబ్బులు కూడ అందడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని కూలీలు మండిపడ్డారు. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. వైఎస్ జగన్ వచ్చారని మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చామని కూలీలు అన్నారు. వైయస్ జగన్ కలిసి తమ సమస్యలు చెప్పుకున్నామని, అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఎండలో రోజంతా కష్టపడినా కూలిడబ్బులు పొట్టకూటికి కూడా సరిపోవడం లేదని వైఎస్ జగన్ దగ్గర వాపోయారు.
see also..