ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా మొత్తం ఇరవై తొమ్మిది సార్లు దేశ రాజధాని ఢిల్లీ మహానగరానికి వెళ్లి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ,కేంద్ర సర్కారులోని పెద్దలను కల్సి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ..విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు కోరాను.
అయిన కానీ కేంద్రం నుండి కానీ ప్రధాన మంత్రి నుండి కానీ ఎటువంటి స్పందన లేదని చంద్రబాబు పార్టీ సమావేశాల్లో కానీ అధికారక కార్యక్రమాల్లో కానీ చెప్పే ప్రధాన మాట .అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పలు మార్లు కలిశాను.ఆ సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేయండి ..
నాకు మాత్రం అన్యాయం చేయకండి అని కోరుతున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.బాబు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ బాబు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లి ఇలా నాకు అన్యాయం చేయకండి ..రాష్ట్రానికి అన్యాయం చేయండి అని కోరడం వలన రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు ..అయితే బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది మీరు ఒక లుక్ వేయండి ..!