దేశంలో ఎక్కువగా జరిగే నేరాల్లో వ్యభీచారం ఒకటి. ఎన్నిచోట్ల పట్టుబడిన మళ్ళీ అదే నేరం చేస్తున్నారు. టెక్నాలజీ పెరగడంతో మరి రహస్యంగా వ్యభీచారం చెయడానికి అదే టెక్నాలజీ వాడుతున్నారు. రద్దిగా ఉండే నగరాలు, జంట నగరాలు ఇలా డెవలప్ అయిన నగరాల్లో ఎక్కువగా ఈ వ్యభీచారం జరుగుతున్నది. తాజాగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయమున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోన్న గురుగ్రామ్ సిటీలో సెక్స్ దందా విచ్చలవిడిగా జరుగుతున్నది.. గడిచిన కొద్ది రోజులుగా అక్కడి బ్యూటీ స్పాల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే పదుల సంఖ్యలో బ్యూటీ పార్లర్లను సీజ్చేసిన పోలీసులు.. తాజాగా షాపింగ్ మాల్లో సాగుతోన్న సెక్స్ రాకెట్ గుట్టును రట్టుచేశారు. సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నిందితులను పట్టుకున్నవైనాన్ని గురుగ్రామ్ పోలీస్ శాఖ పీఆర్వో రవీంద్ కుమార్ మీడియాకు వివరించారు.
see also..
ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
గురుగ్రామ్ సెక్టార్ 50లో గల డీఎల్ఎఫ్ ఓమెక్స్ మాల్లో ఒయిస్టర్ అనే ఓ బ్యూటీ స్పా సెంటర్ ఉంది. అక్కడ వ్యభిచారం సాగుతున్నదంటూ సమాచారం అందడంతో పోలీసులు సీక్రెట్ ఆపరేషన్‌కు రంగం సిద్దం చేసుకున్నారు. విటుడి వేషంలో ఓ అధికారి అక్కడికివెళ్లి నిర్వాహకులతో బేరం కుదుర్చుకున్నాడు. గదిలోపలికి వెళ్లిన తర్వాత టీమ్‌ను అలర్ట్చేశాడు. బిలబిలమంటూ అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టిన పోలీసులను చూసి స్పా నిర్వాహకులు ఖంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో ఆరుగురు మహిళలున్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, స్పా అసలు యజమాని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Haryana: Sector-50 Gurugram police busted a sex racket operating on the pretext of a spa, 9 people arrested. Case registered. pic.twitter.com/A48Z4DsoJw
— ANI (@ANI) March 19, 2018