రూ.50 కోట్లకు ప్రజారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్దరించేది..?? అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సరే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానులను రెచ్చగొట్టి మరీ లాక్కున్నారు. అంతటితో ఆగక, ప్రతీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డబ్బులు వసూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వసూలు చేసిన నగదుతో కోట్లకుపైగా సొత్తును వెనకేసుకున్నారు. పార్టీ పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం ఏమైనా ఉద్యమాలు చేశారా..? అంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. అసలు మీరు పార్టీ పెట్టారా లేక, ధనార్జన కోసం ప్రజారాజ్యం అనే వ్యాపార కంపెనీ పెట్టారా..? ఇప్పుడేమో జనసేన అధికారంలోకి వస్తే అంటూ కొత్త నాటకానికి తెర తీస్తారా..? అంటూ ఓ సాధారణ వ్యక్తి మెగా బ్రదర్స్ ఇద్దరినీ తన మాటలతో ఏకిపారేశాడు.
see also : దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం ….!
కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనార్జనే లక్ష్యంగా పెట్టిన ప్రజారాజ్యంపార్టీ పేరు మీద 2009 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టిక్కెట్లు అమ్ముకొని రూ.50 కోట్లు వెనకేసుకున్న విషయం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించాడు. ప్రజారాజ్యం పార్టీ కుంభకోణంలో పాలుపంచుకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్దరించేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి మెగా అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసిన మీరు.. వారికి చెప్పే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారా..? ఈ ప్రశ్నకు మీరు అభిమానులకు చెప్పే సమాధానం ఏమిటి..? సరే, ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఒక్కరే కాంగ్రెస్‌లో విలీనం చేశారు అనుకుందాం..? మరి నీవెందుకు ప్రశ్నించలేదంటూ ఆ వ్యక్తి జనసేనానిపై ఏకిపారేశారు.
see also : ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఇప్పటికీ ఎంపీగానే కొనసాగుతుండటం సిగ్గుచేటు. సరే, పదవీ వ్యామోహంతో ఎంపీగా కొనసాగుతున్నాడనుకుందాం.. ఆ హోదాకు తగ్గట్టు ఏపీ ప్రయోజనాల కోసం ఏమైనా పోరాటం చేశాడా..? ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు ఒక్కటై పోరాడుతుంటే.. మీ అన్న చిరంజీవి మాత్రం తనకు, ఏపీకి ఏం సంబంధం లేదంటూ హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చోవడం ఎంత వరకు సబబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశంలోని ఎంపీలను ఒక్క తాటిపైకి తెస్తానన్న నీవు, మొదట ప్రత్యేక హోదా పోరాటానికి ఏసీ రూముల్లో ఉన్న మీ అన్న చిరంజీవిని ఒప్పించు అంటూ హితవు పలికారు. ఇప్పటికే మీ అన్న రాజకీయ భాగోతం బట్టబయలైంది.. నీ నాటకం కూడా బట్టబయలయ్యే రోజు దగ్గర్లోనే ఉందంటూ పవన్ కల్యాణ్‌కు హెచ్చరికలు చేశాడు.