దేశంలో ఎక్కడ చూసిన ఎక్కువగా జరిగే నేరాల్లో మొదటిది అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాల వల్ల నేరాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరుసలు మరచి సభ్య సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. భర్త లేదా..భార్య చేసే అక్రమ సంబంధాల వల్ల వారి పిల్లల జీవితాలు, వారి జీవితాలు నడి రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఉద్యోగం పోతుందనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ హోంగార్డు నున్న సమీపంలోని సుబ్బయ్యగుంట వద్ద నిర్మానుష్య ప్రదేశంలో విషపదార్థం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగు చూసింది.
see also..
ఏపీలో నగదు కొరతపై కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు మీ కోసం..!!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లాలోని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే అజిత్‌సింగ్‌నగర్ డాబాకొట్ల కూడలికి చెందిన కనగాల శ్యాంప్రసాద్(36)కు, అదే ప్రాంతానికి చెందిన సంతోషమ్మతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న శ్యాంప్రసాద్ దుర్గగుడిపై విధులు నిర్వహిస్తున్నారు. ఓ కేసులో భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితతో పరిచయం పెట్టుకున్నాడు. ఆ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు ఈ విషయం భర్త కనిపెట్టాడు. ఒకటి, రెండుసార్లు బెదిరించి చూసినా ఫలితం మాత్రం కనిపించలేదు. దాంతో వివాహిత భర్త సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు హోంగార్డ్ శ్యామ్ కి ఉన్నతాధికారులు గట్టిగా మందలించారు.
see also..
సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..!
దీంతో ఉద్యోగం పోతుందేమోనని శ్యామ్ ప్రసాద్ భయపడిపోయాడు. అందులోనూ అక్రమ సంబంధం కారణంగా ఉద్యోగం పోతే.. ఆ విషయంబయటకు వస్తే పరువు పోతుందని ఫీలయ్యాడు. ఇంటి నుండి బయటకి వెళ్లిపోయిన శ్యామ్ ప్రసాద్ అప్పటి నుంచి కనిపించడం లేదు. ఆదివారం మధ్యాహ్నం నున్న సుబ్బయ్యగుంట వద్ద ఓ ఖాళీ ప్రదేశానికి వెళ్లి విషపదార్థం తాగి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయాన్ని గమనించిన స్థానికులు నున్న గ్రామీణ సీఐ ఎం.వి.దుర్గారావుకు సమాచారం అందించగా ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాని అప్పటికే శ్యామ్ మృతి చెంది ఉన్నాడు. ఉద్యోగం పోతుందనే భయంతో మనస్తాపానికి గురైన శ్యాంప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.