ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. కట్టుకున్న భర్త, పిల్లలు ఉన్నప్పటికీ..పరాయి పురుషుల పడక సుఖానికి వెంపర్లాడుతున్న కొంత మంది మహిళలు చేస్తున్న దారుణాలు చూస్తుంటే..సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఓ మహిళ పరాయి మగాడితో సెక్స్ లో పాల్గొంటున్న సమయంలో భర్త చూసి కోపంతో వారిపై కత్తితో దాడి చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామానికి చెందిన అడిగర్ల నూకరత్నం అనే మహిళకు దిగిశివాడకు చెందిన అప్పలనాయుడుతో పదేళ్ల క్రితం వివాహమైంది.భార్య తరచూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దీంతో అనుమానం పెంచుకున్న భర్త.. మామిడి తోటలో కట్టుకున్న భార్య పరాయి పురుషుడితో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో భార్యతో పాటు.. అమెతో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. శ్రీను పారిపోగా నూకరత్నంకు మెడ, తలపై గాయాలయ్యాయి. స్థానికులు బంధువుల సహాయంతో తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇలా జరగడం కొత్త ఏమి కాదు ఏపీలో ప్రతి జిల్లాలో ఈ లాంటి కేసులే ఎక్కవైతున్నాయి.