కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను భద్రాచలం పట్టణంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలి విడతలో నిర్మించిన 88 ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, మంత్రి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….నిరుపేదలకు ఆసరాగా నిర్మించిన ఈ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందన్నారు. పట్టణంలో రూ.4.75 కోట్లతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయానికి శంకుస్థాపన, రూ.కోటితో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని, ఐటీడీఏలో స్కిల్ డౌలప్‌మెంట్ బిల్డింగ్‌లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. యంత్ర లక్ష్మీ పథకం క్రింద లబ్ధిదారులకు 18 ట్రాక్టర్లు, హార్‌వెస్టర్, పవర్‌టిల్లర్‌లను అందజేశారు.
