ఏపీ ప్రతి పక్షనేత గత 122 రోజులుగా ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తో పాటు రోజు వేల మంది పాదయాత్రలో నడుస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో అన్ని జిల్లాలో అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీ లోకి వలసలు జరిగాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. జగన్ పాదయాత్ర గుంటూరులో ప్రవేశించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నేతలు చాలా మంది జగన్ సమక్షంలో అనుచరులతో సహా వైసీపీలోకి వలస వస్తున్నారు. బుదవారం కూడా అలాంటి చేరికలు భారీగా చోటు చేసుకున్నాయి.
see also..
చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశా.. ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తా :పవన్ కళ్యాణ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాసిన్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. ముస్లిములను మనస్ఫూర్తిగా ప్రేమించిన నేతలుగా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు ఎప్పటికీ నిలిచిపోతారని, ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్ల కోసం వైఎస్‌లు ఎప్పటికీ నాటకాలు ఆడరని యాసిన్ చెప్పుకొచ్చాడు. టీడీపీకి చెందిన పొన్నూరు జెడ్పీటీసీ సభ్యుడు తోట శ్రీనివాసరావు, తెలుగుదేశం పట్టణ మాజీ అధ్యక్షుడు షేక్ పెద్ద గఫార్, టీడీపీ నాయకురాలు మండ్రు అనిత, జనసేన నాయకుడు పసుపులేటి శ్రీనివాసరావుతో సహా టీడీపీ ఎంపిటీసీలు, సర్పంచులు అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత కనీసం రైతులు బ్రతికి బట్టకట్టాలంటే కూడా వైకాపాను గెలిపించాలని………మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతు అన్నవాడే ఎవ్వడూ మిగలడని రైతు నాయకులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.మామూలుగా అయితే అధికార పార్టీలోకి నేతల చేరికలు కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కానీ టిడిపిలో ఉన్న పట్టణ, జెడ్పీటీసీ, ఎంపిటీసీ స్థాయి నాయకులు వైకాపాలో చేరడం మాత్రం రాజకీయ విశ్లేషకులను ఆశ్ఛర్యపరుస్తోంది.
see also..