వైసీపీలోకి సీఎం స్థాయినేత.. డేట్ ఫిక్స్..!! అవును, ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు చురుగ్గా పాల్గొన్న ఆ నేత ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ విషయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు చేసిన ఏపీకి అన్యాయం చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, తెలుగుదేశం పార్టీలపై ఏపీ ప్రజల్లో పెరిగిన వ్యతిరేక పవనాలను ముందుగానే పసిగట్టిన ఆ బీజేపీ నేత తనతోపాటు, తన అనుచర వర్గం సుమారు ఐదు వేలమందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
see also : గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
see also : ”జగన్‌తో ఏకీభవించిన పవన్ కల్యాణ్”..!!
see also : కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచి..మంత్రి ఈటల
ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైఎస్ జగన్ అంటే తనకు, తన మామకు ఎనలేని ఇష్టమని, తన మామ వైఎస్ జగన్‌ను కలిపించాలని తనను ఎప్పుడు అడుగుతుంటాడని, వైఎస్ జగన్ పాదయాత్ర వైజాగ్‌కు చేరుకోగానే తన మామను జగన్‌తో కలిపిస్తానని చెప్పిన మాటలు విధితమే. అంతేగాక… ఇటీవల కాలంలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కూడా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరువాత జగన్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇలా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరిగా మీడియా సాక్షిగా బయటపెడుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో మరింత అభిమానాన్ని చూరగొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతోపాటు, సినీ ప్రముఖులు కూడా 2019లో వైఎస్ జగనే సీఎం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీకి రాం రాం చెప్పి గుంటూరు జిల్లాలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.