చంద్రబాబు విషయంలో.. జగన్‌తో ఏకీభవించిన పవన్ కల్యాణ్..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో లక్ష కోట్లరూపాయలకు పైగా పాల్పడ్డారు. ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్‌ను విడిచి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని లక్ష ఎకరాల భూమిని తన బినామీల పేరుతో రిజిస్ర్టేషన్ చేయించాడు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని చంద్రబాబు బినామీలైన టీడీపీ నేతల పేరిట రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఇలా ఏపీ ప్రజలకు, రైతులపై చంద్రబాబు పన్నిన కుట్రలెన్నో అంటూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. అయితే, ఈ విషయాన్నే జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఒప్పుకున్నాడు.
see also : లోకేష్ అవినీతిని బట్టబయలు చేసిన పవన్ కళ్యాణ్
see also : గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
అయితే, బుధవారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చంద్రబాబు అండ్ కో నేతల అవినీతిని ఏకి పారేశారు. తాజాగా నారా లోకేష్ అవినీతిని కూడా తెరపైకి తెచ్చారు పవన్ కల్యాణ్. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో కలిసి ప్రస్తుత ఏపీ ఐటీశాఖ మంత్రి, స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు నారా లోకేష్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, చెప్పారు. అటు శేఖర్‌రెడ్డి అవినీతి కేసులో మంత్రి నారా లోకేష్ పేరు ఉండట, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పేరుతో రాజధాని భూమిని తన బినామీలకు లక్ష ఎకరాలకు పైగా కట్టబెడుతూ.. అక్రమార్జనలకు పాల్పడుతుంటే.. ఇటువంటి అవినీతి పరులకు ప్రధాని మోడీ ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తాడు అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
అయితే, జనసేన ఆవర్భావ సభలో పవన్ ప్రసంగం చూసిన రాజకీయ విశ్లేషకులు.. పవన్ మాట్లాడిందంతా.. వైఎస్ జగన్ గత నాలుగు సంవత్సరాల నుంచి చెబుతున్నదే కదా..?, పవన్ ప్రసంగంలో కొత్తదనమేముందనే భావనను వ్యక్త పరుస్తున్నారు.