ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఇంకా మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం పడుతోంది.ఏపీ దెబ్బకు యూపిలో బిజెపి ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి ప్రకటనలు చేయించింది.దీనిపై టీవీలలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు ఒక ప్రకటన చేస్తూ ఏపీ దెబ్బకు బిజెపికి యూపిలో ఎదురు దెబ్బతగిలిందని అన్నారు. ఎపికి అన్యాయం చేసినందున గోరక్ పూర్ లో అదిక సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. అంతేకాక ఏపీకి చేసిన అన్యాయానికి అక్కడి ప్రజలు సమాధానం చెప్పినట్లయిందని వారు అన్నారు.కాగా బిఎస్పి, సమాజవాదిపార్టీలు బిజెపికి వ్యతిరేకంగా కలిసి పోరాడి విజయం సాదించారని, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభినందించారు.