సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గడువు దగ్గరవుతున్న కొద్దీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నుంచి వలసలు భారీగా పెరిగాయి. గోదావరిఖనిలో హెచ్ఎంఎస్ యూనియన్‌కు చెందిన ముఖ్య నాయకులు షబ్బీర్‌అహ్మద్, అంబటి నరేశ్ ఎంపీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. వీరికి తోడుగా పెద్ద సంఖ్యలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా ఏపీఏ డివిజన్ పదోగని ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ ఆకుల మల్లయ్యతోపాటు మరో 50మంది సోమవారం టీబీజీకేఎస్‌లో చేరారు. వారికి ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్ కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు.
ఏఐటీయూసీ భూపాలపల్లి ఏరియా బ్రాంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీపీఐ భూపాలపల్లి పట్టణ కార్యదర్శి నల్లబెల్లి సదానందం, ఓపెన్ కాస్టు షిఫ్ట్ ఇన్చార్జి సర్వేశం, ఐఎన్టీయూసీ ఫిమ్స్ మెంబర్ టీ నరేంద్రస్వామి నేతృత్వంలో ఈ కార్మికులు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకి గుడ్‌బై చెప్పారు. వీరిని భూపాలపల్లిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో కరీంనగర్, వరంగల్ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, పసునూరి దయాకర్, ఎన్నికల ఇంచార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల ఆర్థిక సహాకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు గులాబీ కండువాలు కప్పి టీబీజీకేఎస్‌లోకి ఆహ్వానించారు.