ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటివల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.
ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఎలా అయితే విడాకులు తీసుకొని మాట్లాడుకుంటున్నారో టీడీపీ బీజేపీ పార్టీల మధ్య కూడా అట్లాంటి సంబంధమే ఉంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీతో అప్పుడప్పుడు కల్సి పనిచేస్తాం అని ఆయన అన్నారు ..