తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నవారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగామోహన్ చక్రు(కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు),శికరి శ్రీనివాస్(కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షుడు),విట్టోభ శేఖర్(సీనియర్ నాయకులు)ఉన్నారు, వీరికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కండువా వేసి పార్టీ లో కి ఆహ్వానించారు.
గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులకి తము ఆకర్షితులమై పార్టీ లో చేరినట్టు వెల్లడించారు.
ఆర్మూర్ అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోనే సాధ్యం అని వారు పేర్కొన్నారు.వీరి వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ,నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్,ఆర్మూర్ టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కలిగొట్ గంగాధర్,అధికార పార్టీ నాయకులు దర్లా రాజు,గడ్డం మహేష్ రెడ్డి తదితరులు ఉన్నారు