తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా గజ్వేల్ మండలం తునికి బొల్లారంలో కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితుల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు వద్దు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తమన్నారు.
see also :పక్క రాష్ట్ర సీఎం సంచలన కామెంట్…చూసి నేర్చుకో బాబు
కొండపోచమ్మ సాగర్ కింద 2,80,280 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు . ఈ క్రెడిట్ అంతా భూనిర్వాసితులకే వెళ్తుందని… రైతులు, ప్రభుత్వం పక్షాన భూనిర్వాసితులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తమన్నారు.
see also :నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..!
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముంపు బాధితులేనన్న మంత్రి.. ముంపు బాధితుల బాధేంటో సీఎం కేసీఆర్‌కు తెలుసునన్నారు. కచ్చితంగా అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్ల నిర్మాణం చేస్తున్నమని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతీ 15 రోజులకోసారి వచ్చి ఇండ్ల నిర్మాణాలను పరిశీలిస్తమన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.