ఏపీలో ప్రస్తుతం రాజకీయ వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో గతంలో పీసీసీ డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ,మాజీ కాంగ్రెస్ నేత డాక్టర్ జి.గంగాధర్ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.మొగల్లాజపురం లో ప్రజాశక్తి నగర్ లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎగైన్ అనే నినాదంతో ఈనెల పదకొండో తారీఖున రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ,మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు సమక్షంలో వేలాది మందితో తిరిగి పార్టీలో చేరుతున్నట్లు ఆయన మీడియాకు వివరించారు