హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తుంటాయన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని చెప్పారు.
