ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ పీఠాన్ని వేడెక్కిస్తున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం, అధికారం కోసం బీజేపీ, టీడీపీ ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచాయి. శ్రీ వేంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో నేటి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోడీ, చంద్రబాబు మధ్యర్త్వం చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్యర్త్వమే ఇప్పుడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజీనామాకు దారి తీస్తోంది.
see also : వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!
see also : అభిమానులకు షాకిచ్చిన పవన్ కళ్యాణ్..!
see also : వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ ..!
ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఏపీ ప్రజల ఆలోచనలో చంద్రబాబు, మోడీలు ఇప్పటికే విలన్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గమనించిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తాను పుట్టిన గడ్డపై ప్రజల మనసులో విలన్ కాకూడదు అన్న ఆలోచనకు వచ్చాడని, త్వరలో తన రాజీనామా పత్రాన్నిసమర్పించేందుకు వెంకయ్యనాయుడు సిద్ధమయ్యాడన్న వార్తను నెటిజన్లు పోషల్ మీడదియాలో పోస్టులతో వైరల్ చేస్తున్నారు.