తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ లో మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మహబూబ్ నగర్ అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఇప్పటివరకు విలీన గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు రూ.20కోట్లు, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రూ.25కోట్లుకేటాయించడం జరిగింది.
see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
ఈ రోజు కేటీఆర్ చేతులమీదుగా రూ.20 కోట్ల కేటాయించిన జిఓ ను ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. వీటి ద్వారా మహబూబ్ నగర్ లో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. రూ.20కోట్ల పనులు పూర్తిచేసిన వెంటనే మరిన్ని నిధులు ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో త్వరలోనే ఐటీ టవర్ ను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ లోని విలీన గ్రామాలు, అన్ని గ్రామ పంచాయితీలకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందచేస్తామని తెలియజేశారు.
see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!