ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనేతవైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ క్షేత్ర స్థాయి నుండి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను చెబుతూనే మరోవైపు టీడీపీ సర్కారు అవినీతిపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్నారు.పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో భాగంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైకెక్టర్ కర్ణ లక్ష్మారావు, మద్దు ప్రకాష్‌రావు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ క్రమంలో పార్టీలో చేరినవారికి జగన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
see also..వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?