ఆయన టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే .పార్టీ అధినేతకు వీర విధేయుడు .ఆయన ఎంత చెప్తే అంత ఆ ఎమ్మెల్యేకు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై ..ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు మీద మీడియా ముందు తీవ్ర పదజాలంతో విరుచుకుపడతాడు .ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారా ..?.
ఆయనే రాష్ట్రంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ.కానీ ఈ మధ్య సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఆయన ఊసే కనిపించడంలేదు .రాష్ట్రంలో మొన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సదరు ఎమ్మెల్యేకు స్థానం దక్కుతుందని ఇటు ఉమ అనుచరవర్గంతో పాటుగా టీడీపీ నేతలు అంతా భావించిన కానీ బాబు కరుణించలేదు. ఊహించినట్లుగా మంత్రి పదవి రాకపోవడం వలన ఎమ్మెల్యే బోండా ఉమలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అంతే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరి రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన మా కాపుల గొంతు కోస్తారా.. అంటూ కొత్త గొంతుక లేవనెత్తారు.ఒకవైపు అసలే మొదటి నుండి కాపుల సెగ తగులుతున్నవేళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే నేతలే ఇలా మాట్లాడడం బాబులో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో బాబు బోండా ఉమను పిలిపించి మాట్లాడటంతో మెత్తబడ్డారు.అంత ఒకే అని అనుకుంటున్న తరుణంలో కానీ స్లోగా బోండా ఉమ సైడైపోయారు.
ఇందుకు ప్రధాన కారణం మీడియా ముందుకు బోండాను వెళ్లనీయకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన్ను పార్టిసిపేట్ చేయనీయకపోవడం లాంటి ఆర్డర్స్ ఇచ్చారు అంట బాబు .సో పార్టీలో గతంలో ఉన్న అధికార ప్రతినిధి పదవి కూడా దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు టికెట్ రాకపోవచ్చని భావిస్తున్న ఉమ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అంట .అందుకే టీడీపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు కోడై కూస్తున్నాయి .దీంతో బాబు దెబ్బకు ఆయన టీడీపీ నుండి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి .