మోడీ, చంద్రబాబ్ సర్కార్‌లకు సూపర్‌స్టార్ వార్నింగ్..!! ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. స్వయాన నెటిజన్లే. అయితే, ఈ మాటలు మేము అనడానికి కారణం కూడా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. నెటిజన్లు అలా అనడానికి కారణం ఏంటి..? ఇంతకీ మోడీ, చంద్రబాబులకు సూపర్‌స్టార్ మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది అన్న విషయాలపై ఓ సారి లుక్కేద్దాం.
see also : ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!
ఇక అసలు విషయానికొస్తే.. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబోలో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కథ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందన్న వార్త ఇప్పుడు షోల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల రిలీజైన్ భరత్ అనే నేను టీజర్ సోషల్ మీడియాలో 10 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆ టీజర్‌లో మహేష్ పలికిన సంభాషనలను విన్న నెటిజన్లు.. మహేష్ బాబు డైలాగ్‌లు పలికే విధానం అచ్చం ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ అన్న మాటలను గుర్తుకు తెస్తున్నాయి.
see also : ప్రతీ ఒక్కరికి తెలియజేద్దాం..!!
ఓసారి టీజర్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబు పలికిన డైలాగ్‌లను పరిశీలిస్తే … చిన్నప్పుడు మా అమ్మ నాకొక మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ ఎ గోల్డెన్ మ్యాన్ అని, ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మరిచిపోలేదు. నా జీవితంలో నేను అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు.. కష్టమైంది కూడా. కానీ ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాస్ ఐ యామ్ ఏ మ్యాన్.
వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. ప్రతీ ఒక్కళ్లకీ భయం, బాధ్యత ఉండాలి. ప్రామీస్ అంటూ గాంధీ, అంబేద్కర్ ఫోటోల నడుమ కూర్చుని మహేష్ బాబు పలికే డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
see also : నన్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్
అయితే, ప్రత్యేక హోదాపై ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో విడుదలైన ఈ టీజర్ డైలాగ్ ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ ఎ గోల్డెన్ మ్యాన్ అన్న మాటలు మోడీ, చంద్రబాబు సర్కార్‌లకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి. పార్లమెంట్ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేసి మరీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌లు సరిగ్గా సరిపోయాయి. భరత్ అనే నేను టీజర్ చూసిన నెటిజన్లు మెడీ, చంద్రబాబుకు ప్రత్యేక హోదా విషయంలో చురకలంటిస్తున్నారు.