ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాగా, బుధవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మీడియా సమావేశం పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పగా.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను సమర్ధిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రతీ అంశాన్ని ప్యాకేజీ రూపంలో ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, ఏపీ ప్రజలు కూడా జపాన్ దేశం ప్రజల స్థాయిలో కష్టపడి పనిచేసి ఏపీని అభివృద్ధి చేసుకుందామంటూ మీడియా సమావేశంలో తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
see also : బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
see also : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ శృంగార పురుషుడు..!
అయితే, ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే.. వారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 25 ఎంపీలను వైఎస్ఆర్సీపీకి ఇవ్వండి.. హోదా ఎలా రాదో నేను చూస్తానంటూ ఖలాఖండిగా చెప్పారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత నాదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెపుతారని, టీడీపీ పార్టీలో ఎవ్వరినీ నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్దలవద్ద సాగిలపడి.. ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబూ..మీకు చేతకాకపోతే చెప్పండి.. ప్రత్యేక హోదా మేం తెస్తామంటూ సంచలన ప్రకటన చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.
see also : గేల్ రికార్డు…!