వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి చెప్పారు.
see also : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చాల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు
గత పదిరోజులుగా ఇదే అంశం మీద వైసీపీ పోరాడుతూనే ఉంది.అయితే జగన్ చేస్తున్న పోరాటాలకు ప్రజల్లో వచ్చిన చైతన్యానికి భయపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ సందేశానికి అభినందనలు తెలిపే క్రమంలో ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు.అందుకే రాష్ట్రప్రయోజనాల నిమిత్తం కలిసి పోటి చేశాం.
see also :ఆందోళనలో చంద్రబాబు..!
ఇప్పుడు పద్నాలుగు సంఘం అని కుంటి షాకులు చెబుతున్నారు.ఇది కరెక్ట్ కాదు .దేశంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వలన కలిగే లాభాలను కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి కూడా కొనసాగించాలి .ఇది బీజేపీ పార్టీకి చెందిన నేతలకు మంచిది కాదు.రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించి తీరాలని అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు.అయితే అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా ..దానికన్నా కేంద్రం ఇస్తున్న ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని చెప్పిన బాబు జగన్ దెబ్బకు దిగొచ్చి ఇలా ప్రకటించాడు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .