ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ పేజీ కోసం ఓ బిడ్డకు పాలిస్తూ ఫొటోలకు ఫోజివ్వడం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. బిడ్డకు పాలిస్తూ ‘గృహలక్ష్మీ’ పత్రికకు ఫోజిచ్చిన ఈ కేరళా నటి, మోడల్, కవయిత్రి గిలు జోసెఫ్ ఇప్పుడు ఒక వైపు విమర్శలు, మరో వైపు ప్రశంసలను అందుకుంటోంది. ‘‘తల్లులు బిడ్డకు పాలివ్వడానికి సిగ్గుపడొద్దు. మీ పిల్లల ఆరోగ్యం కోసం చనుపాలు ఇవ్వడం తప్పనిసరి’’ అనే సందేశంతో గిలు జోసెఫ్ తన స్తనాలు కనిపించేలా బిడ్డకు పాలిస్తూ ఫొటోకు ఫోజిచ్చింది. అయితే, కొంతమంది ఇందులో ‘అమ్మతనం’ చూడటానికి బదులు.. ఆమె స్తనాల ప్రదర్శనను తప్పుబడుతున్నారు. మరికొందరు మతం రంగు కూడా పులుముతున్నారు. ఇంకొందరైతే ఆమెను వ్యభిచారి అని, భరితెగించిన ఆడది అంటూ తిట్టిపోస్తున్నారు.తనపై వస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘మొన్నటి వరకు నన్ను కవియిత్రి అన్నారు. ఇప్పుడు నన్ను భరితెగించిన ఆడది. వ్యభిచారి అంటున్నారు. బిడ్డకు పాలివ్వడంలో అసభ్యత ఏముంది? అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది