సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే నెటిజన్ ” తెలంగాణ విజయ్ ” జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ పై ఒక చక్కటి విశ్లేషణ రాశాడు..ఆ పోస్ట్ సవివరంగా మీకోసం..
నేడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది.70ఏండ్ల బారత స్వాతంత్ర దేశంలో పేదవాని ఎదుగుదల ఇప్పటికి ప్రశ్నార్దకంగానే మిగిలింది..తరాలు మారుతున్నా తలరాతలు మారలేని స్థితి.అదికారంలో తలా పదేళ్ళు పాలకులు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు.ఇంకా బారత్ అభివృద్ది చెందుతున్న దేశంగానే 70ఏండ్లుగా చెప్పుకుంటూ వస్తున్నం.రైతు రాజు అవుతాడనుకుంటే రాజ్యం విడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది.ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ పార్టీ పోతే ఆపార్టీ పార్టీలు మారుతున్నయ్ తప్పిస్తే పరిస్థితిలో ఇసుమంతైనా మార్పులేదు.బిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం..ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ఏకత్వాన్ని చెడగొట్టుతూ రాజకీయ అవసరాలను తీర్చుకుంటున్నాయి.తమాషా ఏంటంటే ఈ ఆటలో పావులవుతున్నది మాత్రం సామాన్య ప్రజానికం..
దేశంలో సమూళ మార్పులు అవసరం.రాజకీయ వ్యవస్థ పూర్తి ప్రక్షాళన అవసరం..ఆదిశగా జరగాలంటే స్పష్టమైన అవగాహణ కలిగిన నాయకత్వం అవసరం..అది జరగాలంటే సమస్యను మూలాల్లోకి వెల్లి పరిశీలించే,వ్యవస్థపై మంచి పట్టు ఉన్న నాయకుడు అవసరం…కేసీఆర్ గారు అందుకు సరితూగుతారని నా వ్యక్తిగత అభిప్రాయం..
దేశంలో కాంగ్రేస్ ,బీజేపీలు వరుసగా ఒకరుపోతే మరొకరు అధికారంలోకి వస్తూ ఉన్నారు.ప్రజలు వాళ్ళను చూస్తూ విసిగి వేసారి పోయారు.ఐనా గెలిపిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆ రెంటికి ఇప్పటి వరకు సరైనా ప్రత్యామ్నాయం లేదు.ఒక వేల గతంలో ప్రత్యామ్నాయం పుట్టుకొచ్చినా దానికి నాయకత్వం వహించి ,ఆ కూటమిని సరైన పద్దతిలో నడిపించే నాయకుడు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.వాస్తవానికి కేసీఆర్ గారి నాయకత్వంలో సైతం అందరూ కలిసిపనిజేస్తారా అనే అనుమానమూ లేకపోలేదు.కానీ నడిపించగల చతురత కేసీఆర్ లో ఉందనేది మేదావులు,విశ్లేషకుల వాదన..
దేశంలో 70ఏండ్లుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి..ఒక పార్టీ అదికారంలో ఉంటే అంతకుముందు పార్టీని నిందించడం,దానికి కారణం మీ పాలనే అనడం,మరో పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నిందించడం.అంతిమంగా ఆత్మహత్యలను ఓటుబ్యాంకుగా మలుచుకోవడంలో ఆ రెండు పార్టీలు సఫలమయ్యాయనే చెప్పవచ్చు.కానీ ఆ ఆత్మహత్యలు 70ఏండ్లైనా ఇంకా ఆగని పరిస్థితి.దీనికి పరిష్కార మార్గాలు అన్యేషించడం మానేసి ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడమే పనిగా ఆ రెండు పార్టీలు ముందుకెల్లడం ఈ దేశానికి శాపంగామారింది..సమస్య ఎక్కడుంది దాని పరిష్కారం ఎలా చేయాలీ,ఏం చేస్తే ఆ సమస్య తీరుతుందనే దిశగా ఏ పార్టీ ఆలోచించలేదు సరికదా ఆదిశగా ప్రయత్నం చేయక తమ అవసరాలకు రైతును పావుగా వాడుకున్నారు..
70ఏండ్ల స్వతంత్ర బారతావనిలో రైతు తను పండించిన పంటకు తాము దర నిర్ణయించుకోలేని పరిస్థితి.రోడ్డుపై అమ్ముకునే చిన్నా చితకా వ్యాపార సంస్థల నుండి బడా బడా కార్పోరేట్ సంస్థల వరకు తమ దరను తామే నిర్ణయించుకుని ఏకతాటిపై వ్యాపారం చేస్తూ వాళ్ళు గొప్పగా ఎదుగుతున్నారు.కానీ రైతు ఐక్యతను పార్టీల వారిగా చీల్చి వారి ఆత్మహత్యలకు కారణమై రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి ఆ రెండు పార్టీలు…
70ఏండ్లుగా వింటూనే ఉన్నమాట ”రైతు ఆత్మహత్యలు నివారిస్తాం” ”పేదరికాన్ని అంతం చేస్తాం”70ఏండ్లు గా ప్రతీ రైతు,పేదవాడు వింటూ విసిగివేసారిపోయారే తప్పిస్తే ఒక్కనాడు కూడా అది ఆచరణకు నోచుకోలేదు.లోపం ఎక్కడుంది..?కనీసం ఆదిశగా ప్రయత్నమైనా చేసారా ఈ దేశంలో..?ఒక్కరూ ప్రయత్నం చేయలేదు.ఎంతసేపూ పేదవారిని,రైతులను ఎన్నికల కోసమే వాడారు తప్పిస్తే వాళ్ళ బతుకు మార్పుకోసం ఏనాడూ ఆలోచించలేదు..
కాంగ్రేస్ హయాంలో స్కాములు,బీజేపీ హయాంలో నోట్లరద్దు ఫేయిల్యూర్,GSTలాంటివి సామాన్యుని నడ్డివిరిచాయి..లక్షల కోట్లు బ్యాంకులకు టోకరా పెట్టి దేశం దాటిపోయినోల్లకు రాజబోగాలు..!!అదే 10000రూ బ్యాంకులో అప్పున్న సామాన్యుడు,రైతులకు ఇళ్ళల్లకు వచ్చి అవమానాలు.ఈ చర్యలకు దేశం ఆలోచనలో పడింది.ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తుంది దేశం.
అందుకే కేసీఆర్ గారు కరింనగర్ లో రైతు సమన్వయ సమితీ సమావేశంలో చేసిన ప్రసంగంపై దేశవ్యాప్త చర్చ జరిగింది.రైతులు ఆలోచనలో పడ్డారు.దేశంలో మార్పు అవసరం అనివార్యంపై అనంతరం కేసీఆర్ గారు చెప్పిన ఆదారాలతో కూడిన విషయాలు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చజరిగింది.దేశ ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేసీఆర్ గారు ఈ చర్చను తెరలేపడం కొంత మంచి పరిణామం అనే చెప్పవచ్చు..
కేసీఆర్ గారి ఇది సాద్యపడుతుందా..?ఒక్కడితో ఇదెలా సాద్యం..?అసలు కూటమి పెడితే ప్రాంతీయ పార్టీలు ఒకే కూటమిలో మసలగలయా..?తర్వాత విచ్చినం వస్తే పరిస్థితి ఏంటి..?బీజేపీ దూకుడును ఈ కూటమి తట్టుకోగలుగుతుందా..?అసలు ఈ విషయం సాద్యపడుతుందా..? ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు..విమర్శకులు వెలిబుచ్చుతున్న సందేహాలు..ఐతే ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..కేసీఆర్ గారు తెలంగాణా ఉద్యమం మొదలెట్టినప్పుడు కూడా ఒక్కడిగానే మొదలుపెట్టాడు.ప్రజలకు సమస్య తీవ్రతను వివరించడంలో ఆయన సఫలమయ్యాడు.ప్రజల్లోకి వెల్లడం,వారి సమస్యను తెలుసుకోవడం,దాన్నీ మూలాల్లోకి వెల్లి పరిశీలించడం దాని పరిష్కారం కోసం పట్టుబట్టడం ఇవి నాయకత్వ లక్షణాలు.ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వేసిన ప్రతీ అడుగుపై విమర్శలు వచ్చాయి.ఈయనతో ఐతుందా,ఇద్దరు ఎంపీలతో తెలంగాణా సాద్యమా.అయ్యేదా,పొయ్యేదా అనే సందేహాలు చాలా మంది చేసారు.కొందరు ఒక్క అడుగుముందుకేసి అపహాస్యం చేసారు. కానీ తర్వాత ఆయన వేసిన ప్రతీ అడుగు విజయం దిశగా పయనింపజేసింది.ప్రతీ ఆటుపోటులో ముందచ్చే విజయాన్ని వెతుక్కున్నారాయన,ఎక్కడా వెనక్కి తగ్గక ప్రజలకు వివరించి,వారికి అర్దమయ్యేవిదంగా చైతన్యపరిచి ఉద్యమాన్ని మహోద్యమంలా ప్రజామద్దతుతో తీసుకెల్లి ముందుకు నడిపించి గమ్యాన్ని చేర్చారు.నేడు పాలనలో సైతం బేష్ అనిపించుకుంటున్నారు.ఈయన పాలనపై దేశవ్యాప్త చర్చ జరుగుతుంది.తెలంగాణా పదకాలను చాలా రాష్ట్రాలు మోడల్ గా తీసుకుంటున్నాయి.ఇదే కేసీఆర్ గారికి అడ్వాంటేజ్..ఒక ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా అతన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానిస్తారు..
ఇది ఇలా ఉంటే తెలంగాణా ఉద్యమ కాలంలో దేశంలోని దాదాపు అన్ని పార్టీలతో కేసీఆర్ గారికి సత్సంబందాలున్నాయి.తెలంగాణా ఉద్యమంలో స్వరాష్ట కాంక్షను జాతీయ స్థాయిలో అన్నీ మీడియా సంస్థలకు,అన్ని పార్టీల నాయకులకు వివరించారు కేసీఆర్ గారు.గంటల తరబడి వారితో సమావేశమయ్యాడు.జాతీయ మీడియా అతన్ని చాలా గౌరవిస్తుంది..ఆయన సామాన్య ముఖ్యమంత్రే ఐతే దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరిగేది కాదు.ఇన్ని రోజులు వేచి ఉన్నవాళ్ళంతో ఒక్కసారిగా కేసీఆర్ గారి పిలుపుతో ఆయనకు ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు.
వ్యవసాయం పట్ల ఆయనకున్న అవగాహణ చాలా గొప్పది.రైతులకి పెట్టుబడిసాయం అనేది ఒక గొప్ప నిర్ణయం.దీనిపై దేశవ్యాప్త చర్చజరుగుతుంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్నవారు ఆ దిశగా కనీసం ప్రయత్నాలు కూడా చేయలేదు..ఉపాది హామీ పదకం అసలు ఉద్దేశమే లేకుండా పోయింది.చెరువుల పక్కన కాలువలు తీపించడం.మల్లి అవే కాలువలు పూడ్చటం మరికొన్నిరోజులకు అవే కాలువలను తిరిగి తవ్వడం ఇలా వేల కోట్ల రూపాయల దనం వృదా..కనీస అవగాషణ లేని పాలకులు ఈ పనిని వ్యవసాయానికి అనుసందానం చేయాలనే ఆలోచన ఏనాడూ చేయలేదు.కేసీఆర్ గారు ఉద్యమం నుండి ఇది చెప్తూనే ఉన్నారు.జాతీయ ఉపాది హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసందానం చేయడం ద్వారా రైతులకు వ్యయం తగ్గుతుంది.ఉపాది లేనివాళ్ళకు పని కల్పించినట్టు ఉంటుంది.ఈ దిశగా ఏనాడైనా దేశ ప్రభుత్వాలు ఆలోచన చేసాయా అంటే లేదనే సమాదానం వినిపిస్తుంది.
కేవలం అదికారమే పరమావదిగా,ఎన్నికలే ఎజెండాలుగా,కార్పోరేట్ కు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డివిరుస్తున్న కాంగ్రేస్ ,బీజేపీలతో ప్రజలు విసిగివేసారి పోయారు.ప్రత్యామ్నాయం లేదుకాబట్టే తిరిగి తిరిగి వాళ్ళనే గెలిపిస్తూ వస్తున్నారు..
దేశానికి నాయకత్వం వహించడానికి మోడీగారికి ఉన్న అర్హత ఏంటి..కేసీఆర్ గారికి లేని అర్హత ఏంటి..మోడీ కూడా చాయ్ వాలా స్థాయినుండి గుజరాత్ ముఖ్యమంత్రిగా అనంతరం ప్రదానమంత్రి అయ్యారు.దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీపై విసిగి వేసారి,కాంగ్రేస్ ను బొందపెట్టడానికి ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీని అదికారంలోకి తీసుకొచ్చారు.ఐతే ఆ నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పవచ్చు.ఎంత సేపు కార్పోరేట్ కే పట్టం కట్టారు తప్పితే రైతుల గురించి ఏనాడూ ఆలోచన చేసింది లేదు.పైగా నల్లదనం వెనక్కు తీసుకొస్తామంటూ నోట్ల రద్దు చేసి దాని ఉద్దేశ్యం మారి స్వేచ్చగా బడాబాబులు నల్లదనాన్ని మార్చుకునేందుకు నోట్ల రద్దు సహకరించిందనే విమర్శలున్నాయి.దేశంలో చైతన్యం ఏర్పడింది.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలో కేసీఆర్ గారు వేసిన ఈ అడుగుకు తప్పకుండా దేశం మద్దతు లబిస్తుంది.ఆయనలోని నాయకత్వ లక్షణాలు,పోరాడేతత్వం,అతనికి ఉన్న మేదస్సు అతనికి పెద్ద బలం.దేశ రాజకీయాల్లో సమూళమార్పు రావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం.తాను తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలవబోతుంది.తప్పకుండా ఇదో చారిత్రాత్మక సందర్బం..బారత దేశంలో ”కేసీఆర్”ఒక నూతన అద్యాయం సృష్టించనున్నాడనడంలో సందేహం లేదు.