2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తధ్యమని స్పష్టం చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కాగా, ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో అసలు నాయకత్వ లక్షణాలే కనిపించడం లేదన్నారు. రాజకీయ పార్టీ అనేది నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందని, ఆ రెండు లక్షణాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో లేకపోవడం శో చనీయమని ఎద్దేవ చేశారు జలీల్‌ఖాన్.
see also : భార్యను తండ్రి అత్యాచారం చేస్తుండగా చూశానని భర్త..చివరకు ఏం చేశారు
see also : కొండల నడుమ..వన్ పీస్ బికినీలో మత్తెక్కిస్తున్న ప్రపంచ సుందరి…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతూ.. 2050వ సంవత్సరం వరకు ఏపీకి చంద్రబాబు నాయకత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజాభిమానం, మంచి నాయకత్వం, వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు మీద ఆధారపడి నడుస్తున్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనేనన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా, ఆ పార్టీ అధ్యక్షుడు కనుమరుగైపోతారని ఎద్దేవ చేశారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. జగన్‌మోహన్‌రెడ్డి వంటి నాయకుడు ఏపీలో ఉండేందుకు అర్హత లేదని విమర్శించారు.