రైతు పండించిన కూరగాయలు గ్రామాల్లో అమ్మాలి అంటే.. ” కూరగాయలు అమ్మ…! కూరగాయలు ..! ” అని గంపల్లో అమ్ముకునే కాలం…తోపుడు బండ్లలో అమ్ముకొనే రోజులు…ఎండనక ..వాననక… దుమ్ము ..ధూళి ని తట్టుకొని అమ్ముకునే రోజులు….. కష్ట పడి రైతు పండించడం …అదే కష్టపడి కూరగాయలు అమ్మడం…” అది నాటి మాట…” అలాంటి కష్టం రైతుకు ఉందోద్ధు…రైతు పండించిన కూరగాయలు గౌరవంగా అమ్ముకోవాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇది నేటి మాట.
గ్రామాల్లో రైతు కళ్ళలో ఆనందం నింపాలి అని…రైతు పండించిన కూరగాయలు రైతు గౌరవంగా అమ్ముకునేల ..రైతు మురవాలి….. ప్రజల ఆరోగ్యం బాగుండాలి..సంతోష పడాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం…ఆదిశగా మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు…జిల్లాలో రాష్టానికే ఆదర్శంగా సిద్దిపేట లో రైతుల కోసం ప్రజల సంతోషం కోసం అధునాతన సౌకర్యాలతో మోడల్ రైతు బజార్ ని ,గజ్వెల్ నియోజకవర్గంలో ని రాజీవ్ రహదారి పై మోడల్ కూరగాయల మార్కెట్ ని నిర్మించారు..వాటిని ఆదర్శం గా చేస్తూ జిల్లాలో ప్రతి గ్రామంలో అధునాతన సౌకర్యాలతో మోడల్ రైతు బజార్ లు నిర్మాణం జరగనున్నాయి.
see also :ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్
సిద్దిపేట జిల్లాలో అన్ని గ్రామాల్లో మోడల్ రైతు బజార్ లు నిర్మిస్తున్నట్లు 30 రైతు బజార్ షెడ్లకు రూ.15లక్షలు ,₹20 రైతు బజార్ షెడ్లకు రూ.12.25లక్షలు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఉపాది హామి పథకం ద్వారా రూ.10లక్షలు ,గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధుల నుండి రూ.5లక్షలతో ప్రతి గ్రామంలో మోడల్ గా నిర్మిస్తున్నట్లు.అదే విధంగా చిన్న గ్రామాల్లో ఉపాది హామి పథకం ద్వారా రూ.9లక్షలు ,గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధుల నుండి రూ.3.25లక్షలతో నిర్మించనున్నట్లు . ఈ నిధులతో 30,20 రైతు బజార్ షెడ్లు ,మోడల్ టాయిలెట్స్ , త్రాగునీటి సౌకర్యం , మురుగు నీటి కాలువలు , పార్కింగ్ సౌకర్యం అన్ని మౌలిక వసతులతో గ్రామాల్లో మోడల్ గా రైతు బజార్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అన్ని గ్రామాల్లో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని…రైతులకు ,ప్రజల సౌకర్య వంతంగా ఉండేదుకు మోడల్ గా నిర్మిస్తున్నాం అన్నారు.రాష్ట్రంలో మొట్టమొదట సిద్దిపేట జిల్లాలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు..రైతులు గౌరవంగా ఉండాలి…రైతు కళ్ళలో ఆనందం చూడలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని…అందుకు నిదర్శనం సిద్దిపేట ,పాతూర్ రైతు బజార్ లే ఆని…రైతులకు ,ప్రజలకు సౌకర్య వంతంగా చేయడం..రైతులు తెచ్చిన కూరగాయలు ప్రజలకు తాజాగా ఉండేలా మోడల్ గా నిర్మస్తున్నట్లు తెలిపారు. జిల్లా అన్నింటిలో ఆదర్శంగా ఉంది అని..మోడల్ రైతు బజార్ లు నిర్మిించి జిల్లాను ఆదర్శంగా చేస్తామన్నారు.