ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ హోరెత్తింది. ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాల్సిందేనన్న నినాదాలు దేశ రాజధాని ఢిల్లీలో మార్మోమోగుతున్నది. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో చేపట్టిన మహాధర్నా ఉధృతంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆవేదనను యావత్ భారతావనికి వినిపించేలా వైసీపీ నేతలు గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటివరకు సాగించిన సుదీర్ఘగా పోరాటాన్ని గుర్తుచేసిన నేతలు.. ఇప్పుటికైనా కేంద్రం స్పందించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోదా కోసం పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాడుతారని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే.. తమ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. సంసద్‌మార్గ్‌లో కొనసాగిన ధర్నాలో వైసీపీ నాయకురాలు తీవ్రంగా విమర్శించారు.
see also..అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే పుష్పవాణి మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన ఒ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవనీ కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారని..అంతేగాక సుర్యుడు తూర్సునే ఉదయిస్తాడు..ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్ తేస్తాడు అని ఎమ్మెల్యే పుష్పవాణి అన్నారు.